మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
గణపురం,ఆగస్టు 20 (విజయ క్రాంతి): మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామిడి ప్రకాష్రెడ్డి తల్లి రామిడి రాధమ్మ మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం వారి కుటుంబ సభ్యులను పరా మర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గ్రామశాఖ అధ్యక్షుడు ఏడెల్లి మల్లారెడ్డి ఇటీవల కాలుకు శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయనను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
కర్కపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు దేవిశెట్టి రాంనర్సింహారావుకు కాలికి గాయం కావడంతో ఆయనను కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వార్డు సభ్యులు వీరగోని గోపి, జక్కుల కొమురయ్య, ఒద్దుల సబిత-లక్ష్మారెడ్డి, నాయకులు కంచరకుంట్ల రవీందర్రెడ్డి, వీసం భరత్రెడ్డి, మొగిలి శ్రీనివాస్, వీరగోని రవి, అబ్బు కుమార్రెడ్డి, మార్క వేణుగోపాల్, జన్ను సుమన్ తదితరులు పాల్గొన్నారు.






