21 August, 2026 | 2:05 AM

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు

21-08-2026 01:16 AM

తాడ్వాయి,ఆగష్టు,20( విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పలువురు నాయకులు ఆకర్షితులవుతున్నారు. ఇదే క్రమంలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ దుడికే గంగయ్య తో పాటు వార్డు సభ్యులు ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పల్లె శోభా,సండ రాజు, కొణింటి శాంతా, సుతారి కావేరి,రాపోలు సావిత్రి,, కొనింటి భూమిక మంగళ బాలయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులమై తాము ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో పార్టీలో చేరినట్లు తెలిపారు.