calender_icon.png 16 October, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మచ్చ ప్రభాకర్ రావు జయంతి వేడుకలు

16-10-2025 06:51:53 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు స్వర్గీయ మచ్చ ప్రభాకర్ రావు జయంతి వేడుకలు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మచ్చ ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాలి, చేనేత సంఘం నాయకులు నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ రావు పద్మశాలి సంఘ బలోపెతానికి, ఐక్యత కోసం రాష్ట్రవ్యాప్తంగా కమిటీలను ఏర్పాటు చేసి హైదరాబాదులో పెద్ద ఎత్తున పద్మశాలి శంఖారావం సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. వందలాది చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేశారు. వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూనే ఎందరినో చైతన్యవంతులను చేసి చేయూతను అందించాడని కొనియాడారు. వారు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని అన్నారు.

అనంతరం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, సంఘ నాయకులు వృద్ధులకు, వికలాంగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ వోల్లాల కృష్ణహరి, మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల శ్రీకాంత్, సీనియర్ పాత్రికేయులు కొండ లక్ష్మణ్, జిల్లా ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, ఉపాధ్యక్షులు జక్కని ప్రభాకర్, వేముల విష్ణుమూర్తి, దికొండ లక్ష్మీనారాయణ, స్వర్గం నర్సయ్య, వేముల చంద్రశేఖర్, జిల్లా నాయకులు లెక్కల వేణుగోపాల్, వంగర ఆంజనేయులు, వంగర ఆనందం, మెతుకు కృష్ణ చైతన్య, వంగర రవీందర్, మెతుకు గోపికృష్ణ, నర్సప్ప, మెతుకు వంశీకృష్ణ, ఆదర్శ చేనేత సహకార సంఘం అధ్యక్షులు శ్రీపతి వెంకటేశం, మునీందర్, శేఖర్, శ్రీనివాస్ వివిధ మండలాలకు చెందిన సంఘ నాయకులు పాల్గొన్నారు.