calender_icon.png 16 October, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న జరిగే బీసీ బంద్ ను విజయవంతం చేయండి

16-10-2025 06:54:55 PM

బీసీ బంద్ పోస్టర్ ఆవిష్కరణ..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు..

వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్..                    

హన్మకొండ (విజయక్రాంతి): ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే బీసీ బంద్ విజయవంతం చెయ్యాలని బంద్ పోస్టర్ ను హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో బీసీ జేఏసీ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్రములో విద్య, కార్పొరేట్ రంగాలు అన్ని అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయిని, ఈ బంద్ ను విఫలం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని, బంద్ కు సహకరించకపోతే ఖాబర్దార్ అని అన్నారు. ఈ నేల 18 న జరుగుతున్న బంద్ కు  వరంగల్ ఉమ్మడి జిల్లాలోని విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హల్ లు, హోటల్, బస్సులు, ఆటోలు, షాపింగ్ మాల్ లు, ఇంకా మిగితా అన్ని సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఓబీసీ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కాపాడుకోలేని ప్రభుత్వం అసలు కులగణన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ బీసీ రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో ఇలాంటి డిమాండ్ లేకున్నా చట్టం తక్షణమే రూపొందించారు. కాని బీసీ వర్గాల సమస్యలు దశాబ్దాలుగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత ఇవ్వకపోవడం బీసీల పట్ల బిజెపి వైఖరి తెలియజేస్తుందన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కూర కూరపాటి వెంకట్ నారాయణ మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం చేసే  పోరాటాలను, రాజ్యాధికార పోరాటాలు మిళితం చేసి సరికొత్త ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం బీసీ సమాజం గుర్తించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్  సాంబారి సమ్మరావు బీసీ జేఏసీ నాయకులు దొడ్డపల్లి రఘుపతి, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మేలా శోభరాణి, గడ్డం భాస్కర్, పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. సంగాని మల్లేశ్వర్, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకారపు మోహన్, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లెపు సమ్మయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్, యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు గిరిబోయిన రాజయ్య యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు నాగవెల్లి సురేష్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు సాంబరాజు అంకయ్య, గోపా జిల్లా అధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్  డా. చిర్ర రాజు గౌడ్, బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి సురేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి గోపి, అరేగంటి నాగరాజు, పాండవుల సురేష్, మాదం పద్మజ దేవి, తెల్ల సుగుణ, కిషోర్, తాడిశెట్టి క్రాంతి, దాడబోయిన శ్రీకాంత్ యాదవ్, గంగపురం వేణుమాధవ్, ఏరుకొండ పవన్ గౌడ్,గొట్టే మహేందర్ తదితరులు పాల్గొన్నారు.