1 July, 2026 | 6:49 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

ప్రజా హితమే పరమావధిగా స్వచ్ఛంద సంస్థలు పని చెయ్యాలి: ఏసీపీ మాధవి

31-05-2025 12:17 AM

హుజురాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలంటే ఆయా ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగంతొ పాటు స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతో అవసరమని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని శుక్రవారం పీవీ సేవా సమితి ప్రతినిధులతో, సిద్దార్థ్ నగర్ సొసైటీఅధ్యక్షులు సాగి వీర భద్ర రావు ఏసీపి కార్యాలయంలో నూతనంగా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన మాధవిని శాలువాతో సన్మానించి బోకెను అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు వారధిగా పని చేస్తున్నాయని, దేశ పురోభివృద్ధిలో వాటి పాత్ర ఎంతో గాను  ఉపయోగపడతాయన్నారు.