5 March, 2026 | 2:09 AM

మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వాలి

05-03-2026 12:45 AM
  1. గతంలో లోక్‌సభకు ఇద్దరు, రాజ్యసభలో ఒకరు ఉండేవారు
  2. ఇప్పుడు లోకసభ సీట్లలో ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు
  3. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ  

హైదరాబాద్, మార్చి 4(విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో మాదిగలకు ఒక సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. రాష్ట్రంలోని  ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ  స్థానాల్లో ఒకటి మాదిగలకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి మంద కృష్ణ మాదిగ బుధవారం బహిరంగ లేఖ రాశారు.

మాదిగలపై కాంగ్రెస్ పార్టీ సవతి తల్లి ప్రేమనే చూపిస్తుందని తెలిపారు. తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వుడు పార్లమెం ట్ స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్‌లో మాదిగల కు గతంలో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి పార్లమెంట్‌లో ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీల్లో మాలలకు ప్రాతినిధ్య ఉందని, రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ప్రాతినిధ్యం లేదన్నారు.

ఇప్పటికైనా మాదిగలకు రాజ్యసభ  సీటు ఇవ్వాలని రాహుల్‌గాంధీని కోరారు.  గతంలో ముగ్గురు మాదిలకు అవకా శం ఉంటే.. ఇప్పుడు రాహుల్‌గాంధీ నేతృత్వం లో మాదిగలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎంత చిన్న చూపు చూస్తుందో స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ (సీడబ్ల్యూసీ)లో మాదిగలకు ఇవ్వలేదన్నారు.  

గాంధీభవన్‌ను ముట్టడించిన ఎమ్మార్పీఎస్ 

రాజ్యసభలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ శ్రేణులు గాంధీభవన్ ముట్ట డించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్‌రావుకు వినతిపత్రం అందజేశారు.  కాంగ్రెస్ మొదటి నుంచి మాదిగలకు అన్యాయం చేస్తోందని, రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరారు. గాంధీభవన్ ముట్టడించిన వారిలో ఎంఎస్‌పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు నరిసింహ, శ్రీకిషన్ ఉన్నారు.