శ్రమదానం నిర్వహించిన రాజక్కపల్లి గ్రామసర్పంచ్ దోరిశెట్టి మల్లేశం
ధర్మపురి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామసర్పంచ్ దోరిశెట్టి మల్లేశం తన గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బందితో కలిసి బుధవారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత మరియు దేవాలయ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని సభ్యులచేత సర్పంచ్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం దేవాలయం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు మరియు చెత్తను తొలగించారు.
గ్రామ ప్రజలు భక్తి భావంతో దర్శనానికి వచ్చే దేవాలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు కొనసాగుతాయని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మర్రి పోచయ్య, వార్డు సభ్యులు బోడకుంటి తిరుపతి,రంగు మల్లేష్,కొమిరే రమేష్,గ్రామస్తులు కొల్లూరి జితేందర్, చంద్రశేఖర్,తిరుపతి, సిబ్బంది అవునూరి నరేష్, మర్రి చిన్నక్క, మర్రి మల్లమ్మ,తదితరులు పాల్గొన్నారు.




