నూతన జిల్లాగా మహా కుంభ మేళా
ఉత్తర్వులు జారీ చేసిన యూపీ ప్రభుత్వం
లక్నో, డిసెంబర్ 2: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా జరిగే ప్రాంతాన్నంతటినీ కలిపి నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. నూతన జిల్లాకు మహా కుంభ మేళాగా నామకరణం చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని మేళాలో పాల్గొనే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14(1) ప్రకారం మహా కుంభ మేళా జిల్లాలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లకు అధికారాలను కల్పించనున్నట్టు పేర్కొంది. నూతన జిల్లాకు సంబం ధించిన ఉత్తర్వులు ఆదివారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటిం చింది. ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభ మేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ మేళాకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు హాజరవుతారు.






