calender_icon.png 13 January, 2026 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పథంలో మహబూబాబాద్

13-01-2026 02:08:06 AM

l ధాన్యం సేకరణలో ముందంజ 

l యూరియా కొరత లేదు 

l ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి 

మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆశించిన ప్రగతి దిశగా పయనిస్తోందని జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదిక ద్వారా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి సరిత, పౌరసరఫరాల శాఖ అధికారి రమేష్, జిల్లా మేనేజర్ కృష్ణవేణి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ కూడా ఏలాంటి ఆటంకాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. డి ఏ ఓ సరిత మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని 571 కేంద్రాల ద్వారా రైతులకు సరఫరా సక్రమంగా జరుగుతోందని చెప్పారు.

ఇప్పటివరకు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని, ఈ జనవరిలో ఇప్పటివరకు పదివేల మెట్రిక్ టన్నులు సరిపడా చేశామని, మరో నాలుగు వేల మెట్రిక్ టన్ల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. యూరియా కొరత రాకుండా ఎప్పటికప్పుడు పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా దిగుమతి చేసి, రైతులకు ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ అధికారి రమేష్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి మాట్లాడుతూ 2025  వానకాలం పంట సాగు లో రైతుల నుండి 2.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు.

ఇందుకోసం 73 ఐకేపీ కేంద్రాలు, 167 సహకార సంఘాలు, గిరిజన కార్పొరేషన్ ద్వారా 12, మెప్మా కేంద్రాల ద్వారా 44,789 రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి 537 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే 104.38 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిలో రాష్ట్రలో 5వ స్థానంలో జిల్లా ఉందని, జిల్లాలో 10,670 లక్ష్యం కాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం కమిటీ ప్రభుత్వ సూచనల ప్రకారం 10,181 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన ఇండ్లు పరిశీలనలో ఉన్నాయని, 8,481 నిర్మాణానికి మార్కౌట్ ఇవ్వగా,  7,336 ఇండ్లు బెస్మిట్ వరకు వచ్చాయని, 4,892 ఇండ్లు గోడల వరకు, 2,667 స్లాబ్ వరకు నిర్మాణంలో ఉండగా, వివిధ చోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం కూడా జరిగిందన్నారు.

వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలకు సుమారు 150 కోట్ల 74 లక్షల నిధులు లబ్ధిదారులకు చెల్లించడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా జిల్లా 86 శాతం పురోగతితో ఐదో స్థానంలో నిలిచిందని, ఇందుకు ప్రోత్సాహంగా రాష్ట్ర హౌ సింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్ జిల్లాను ప్రశంసించారని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమాన్ నాయక్ తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.