calender_icon.png 13 January, 2026 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీ వరంగల్ అధ్యక్షుడి నియామకం

13-01-2026 02:06:53 AM

ట్రై సిటీస్ అధ్యక్షుడిగా ఐయినవోలు మల్లికార్జున శాస్త్రి

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధి నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వ రంగల్ జిల్లా ఇన్చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆమోదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వరంగల్ ట్రై సీటస్ (వరంగల్, హనుమకొండ, ఖాజీపేట) పట్టణాల అధ్యక్షుడిగా ఐయినవోలు మల్లికార్జునశాస్త్రిని ని యమించారు. ఆయనకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేసి, శుభకాంక్షలు తెలిపారు. మల్లికార్జున శాస్త్రి మా ట్లాడుతూ.. ‘నాకు అప్పగించిన ఈ బాధ్యత పట్ల పూర్తి నిబద్ధత నిజాయితీగా పని చేస్తానని, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని’ తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకటేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు భయ్యా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

గుండ్రాతిపల్లి సర్పంచ్‌ను తొలగించాలి

కాటారం మండలం గుండ్రాతిపల్లి సర్పం చ్ ఎన్నికల్లో తప్పుడు బీసీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని తొలగించాలని, రెండవ స్థానంలో నిలిచిన గోనే ముకుందను సర్పంచుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, గోనే ముకుంద, పార్టీ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు.

అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ.. గుండ్రాతిపల్లి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ సమర్పించిన నామినేషన్ అఫిడవిట్, కుల ధ్రువీకరణ పత్రం తప్పుడు వివరాలతో కూ డినవని, వాటిని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు తనిఖీ చేసి, సర్పంచ్ అభ్య ర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తప్పకుండా సమగ్ర విచారణ నిర్వహిస్తామని, అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని రవి పటే ల్ తెలిపారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే తీన్మార్ మల్లన్న స్వయంగా భూ పాలపల్లికి వచ్చి కలెక్టర్‌తో నేరుగా మాట్లాడతారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.