calender_icon.png 13 January, 2026 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది

13-01-2026 03:44:40 PM

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): ఇప్పటికైనా నిజమే గెలుస్తుందని ఆ పదేళ్ల కాలం పాటు మోసం చేశారు కనుక ఇంకా మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ పాలమూరుకు వచ్చి కొన్ని తెలిసినవి కొన్ని తెలియనివి, రాసిచ్చినవి ఎలా పడితే అలా అర్థం పడటం లేని మాటలు మాట్లాడాలని విమర్శించారు.  2001 నుంచి 2014 వరకు ఉదయం నుంచి రాత్రి వరకు పాలమూరు పదం లేకుండా కెసిఆర్ సభ ముగించలేదని ఎప్పుడు మాట్లాడుతూనే పాలమూరు జిల్లాకు తీవ్ర మోసం చేశారని విమర్శించారు. 2009 లో బీఆర్ఎస్ పార్టీ కి 10 శాతం ఓట్లు కూడా లేవని అప్పుడు ఎంపీగా గెలిపించిన ఘనత జిల్లా ప్రజలకు దక్కుతుందన్నారు. వందలసార్లు కాలు అడ్డంపెట్టి నీళ్లు పారిస్తానని చెప్పారని ఇప్పటివరకు మరి కాలు అడ్డం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూరాల ప్రాజెక్టు నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు నీళ్లు మళ్ళీస్తామని చెప్పి ఎందుకు మళ్లించలేదని  విమర్శించారు. పదేళ్ల కాలంలో ఎందుకు ఒక్క బొట్టు నీరు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు తప్ప టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదని కేవలం మోసం మాత్రమే వారికి తెలుసు అసహన వ్యక్తం చేశారు. కొంతలో కొంతైనా పని చేస్తే జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ పనులు కేవలం  కాసుల కక్కుర్తి కోసం మాత్రమే వారు పని చేశారాని తెలిపారు. కేటీర్ ను ముందు జిల్లా కు ఇప్పటి వరకు కూడా అవగాహన రాలేదన్నారు. పాలమూర్ -రంగారెడ్డి పథకం ఆగి పోతుందని ఎందుకు చెప్పలేదన్నారు. శ్రీశైలం లో ఎన్ని నీళ్లు ఉంటాయని చెప్పి, మోసం చేశరాని విమర్శించారు.

జూరాల డ్యామ్ ప్రతి వర్ష కాలం నిండుతుందని తెలిసి కూడా ఎందుకు నీళ్లు మలపలేదని విమర్శించారు. జూరాలలో నీళ్లు ఎప్పుడు కూడా నిల్వ ఉండవు వచ్చినప్పుడు మాత్రమే ఆ నీరే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. జూరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 70 టీఎంసీలు నీటి ని తీసుకునే అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందన్నారు.

ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేవలం నెల రోజులలోనే  కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఒక్క విద్యాసంస్థ కూడా తీసుకు రాలేదని చదువు మీద మీకు సోయి ఉందా అని ప్రశ్నించారు. రెండేళ్ల కాలంలో అనేక విద్య సమస్యలు తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు. ఎంపి గా ఐదేళ్లపాటు పరిపాలించిన కేసీఆర్ పది సార్లు కూడా పాలమూరు జిల్లాకు రాలేదని విమర్శించారు. పదేళ్లు సీఎం గా ఉన్న పాలమూరుకు ఏమి చేయకుండా సిరిసిల్లకి అన్ని నిధులు తీసుకుపోయి అభివృద్ధి చేసుకున్నారు తెలిపారు. పాలమూరు బిడ్డలు తెలివిగలవారు కాబట్టే ఇక్కడ బిడ్డను సీఎం చేసి అభివృద్ధి చేసుకునే దిశగా పాలమూరు ప్రజలు అడుగులు వేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయతీరాలకు చేరిందని, ఎప్పుడు లేనివిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వడ్డీలు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, అభివృద్ధి వేగవంతంగా తీసుకుపోవడం జరుగుతుందన్నారు. మూడేళ్లలో జిల్లా స్వరూపాన్ని మార్చుతామని స్పష్టం చేశారు. 

విద్యా ఆస్తి కంటే ఎంతో విలువైనది...

 విద్య ఆస్తి కంటే విలువైనదని తెలుసు కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 2023 ఎన్నికల తరువాత ప్రతి పక్ష పార్టీ లో కూర్చోబెట్టిన అసెంబ్లీకి కెసిఆర్ కు రాకుండా దూరంగా ఉండి రాజులా ఎప్పుడో ఒకసారి రాజరికం పాలన లా వచ్చిపోతున్నారని విమర్శించారు. రెండు మార్లు అసెంబ్లీ కి వచ్చి కేవలం ఒక మారు గంట, మరో మారు 20 నిముషాలు మాత్రమే వచ్చారని తెలిపారు. గడిచిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పాలమూరు పట్టణంలో 5673 ఓట్లు వేశారని తెలిపారు. బీఆర్ఎస్ కు పట్టణంలో ఓట్లు రావని, 50 డివిజన్ లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాకు పాలమూరు గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అనేక ఉద్యమాలకు జిల్లా కేంద్రం ఎంతో గుండెకాయల నిలిచిందన్నారు. 

రెండేళ్లు కాలంలో రూ 2వేల కోట్లు కేటాయించడం జరిగిందని, రాజకీయం మాకు అవసరం లేదని, మరింత సమయం లో మహానగరం మహబూబ్ నగర్ చేరుకుంటుదని తెలిపారు. ఇప్పటికీ వారు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఇది ఎవరు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది పాలమూరు జిల్లా నుంచి జరిగిందని ఆనాడు ఈ మోసపూరితమైనటువంటి నాయకులు ఎవరూ లేరని విమర్శించారు. ఎవరు ఏదో చెబితే వాటి నమ్మకూడదని నిజాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని ఆ నిజమే ఎల్లప్పుడు నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ కుటుంబంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి చేయకూడదని, బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొంతమంది నాయకులు కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయలేదని ప్రశ్నించారు. అతి చిన్నగా ఉన్న గజ్వేల్ తో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్న పళ్ళు జిల్లాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎలా జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో అన్ని భవనాలు అద్భుతంగా నిర్మించుకున్నారని, అలాంటి పనులు ఇక్కడ జరగలేదని అప్పుడు ఈ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు. ప్రజల బాగోగులు తప్ప రాజకీయాలు చేయడం లేదని వాస్తవాలను ముందు ఉంచి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమం లో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఓబేదుల కొత్వాల్,మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సిహ్మ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రి, పాషా, బెనహర్ తదితరులు ఉన్నారు.