calender_icon.png 13 January, 2026 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

13-01-2026 03:06:10 PM

హైదరాబాద్: నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Goud) మంగళవారం నిర్వహించిన చిట్ చాట్ లో స్పష్టం చేశారు. సినీ రంగంలో తమకు అందరూ సమానమేనని పేర్కొన్నారు. జిల్లాలను తొలగించాలనే ఆలోచన తమకు లేదన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలోచేరుతున్నారనే ప్రచారం అవాస్తమని మహేష్ గౌడ్ వివరించారు. కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందని కవిత చెప్తున్నారని పునరుద్ఘటించారు. కవిత(Kavitha) చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఆదరించరని సూచించారు. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్ లేదన్నారు. బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటుబ్యాంకు పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ విమర్శించారు.