calender_icon.png 30 January, 2026 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కుల పరిరక్షణే ప్రజాస్వామ్య బలం

30-01-2026 05:49:16 PM

-సర్పంచ్ నరేష్ నాయక్ 

కోనరావుపేట,(విజయక్రాంతి): పౌరుల హక్కులు, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని పాటించాల్సిన అవసరం ఉందని పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా  జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు, న్యాయ పరిరక్షణ, సమాన హక్కులు, అంటరానితనం నిర్మూలన, బాలల హక్కులు, మహిళల హక్కులు, ఎస్సీ/ఎస్టీ హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై  ప్రభుత్వ  అధికారులు వివరించారు.

ఈ సందర్బంగా సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ,  ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనె చట్టం 1955లో అమలులోకి వచ్చిందని. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు. “ప్రతి పౌరుడికి తన హక్కులపై అవగాహన ఉండాలి. అలాగే ఇతరుల హక్కులను గౌరవించడం కూడా మన బాధ్యత. హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తుంచుకోవాలి” అని పేర్కొన్నారు. పౌర హక్కుల పరిరక్షణ ద్వారా సమాజంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలందరూ హక్కులు–బాధ్యతలపై అవగాహన పెంచుకొని న్యాయ సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ లకవత్ తిరుపతి , జిపిఓ ప్రవీణ్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్, గ్రామ పోలీస్ నరేష్, ఉప సర్పంచ్ రాజు నాయక్, గ్రామ ప్రజలు, యువత, మహిళలు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.