calender_icon.png 30 January, 2026 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనేని సంపత్ రావు సేవలు మరువలేనివి

30-01-2026 05:27:01 PM

సంతాప సభలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు

తుంగతుర్తి (విజయ క్రాంతి): ఉపాధ్యాయ ఉద్యోగరీత్యా, విద్యార్థులకు ఉత్తమమైన బోధన చేసి, సమాజ సేవలో రాణించిన కీర్తిశేషులు మేనేని సంపత్ రావు చేసిన సేవలు మరువలేనివని, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగి కీర్తిశేషులు మేనేని సంపత్ రావు సంతాప సభలో, జ్యోతి ప్రజ్వలన నిర్వహించి, కుమారులు సోమేశ్వరరావు వేణు ప్రకాశరావులను సన్మానించారు.

అనంతరం పలువురు వక్తలు ఆయన చేసిన సేవలను కొనియాడారు. రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో రాణించి, కీర్తి ప్రతిష్టలు, పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, యాదగిరి గౌడ్, మండల బాధ్యులు పోలవరపు సంతోష్, కాస మల్లయ్య, పుల్లయ్య, సోమయ్య, కరుణాకర్, వెంకట్ రెడ్డి, దాసు , మాజీ సర్పంచ్ సంకినేని స్వరూప రావు తదితరులు పాల్గొన్నారు.