calender_icon.png 23 January, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్‌టెక్ ఎనర్జీ TRUZON SOLARను ప్రారంభించిన మహేశ్‌బాబు

23-11-2024 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 22: సోలార్ సిస్టమ్స్ కంపెనీ సన్‌టెక్ ఎనర్జీ నూతన బ్రాండ్ TRUZON SOLARను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రారంభించారు. ఆన్‌గ్రిడ్, హైబ్రీడ్ రూఫ్‌టాప్, గ్రౌండ్‌మౌంటెడ్ సోలార్ సిస్టమ్స్ తదితర ఉత్పత్తుల్లో తాము అగ్రగామిగా ఉన్నామని, ఇప్పటికే నివాస గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు రెండు లక్షలుకుపైగా సోలార్ సిస్టమ్స్‌ను బిగించామని సన్‌టెక్ ఎనర్జీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ భవానీసురేశ్ తెలిపారు.

ఇప్పుడు పర్యావరణ ప్రేమికుడైన మహేశ్‌బాబు భాగస్వామ్యంతో TRUZON SOLAR ద్వారా సౌరశక్తి వినియోగంపై ప్రజలకు మంచి అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నట్టు సురేశ్ పేర్కొన్నారు. వచ్చే ఐదేండ్లలో 10 రెట్ల వృద్ధి సాధించాలన్నది తమ కంపెనీ లక్ష్యమని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో  డీలర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని వివరించారు.