05-09-2025 01:08:49 PM
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణేష్ దర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శనం చేసుకున్నారు. అనంతరం టిపిసిసి అధ్యక్షుడు ఖైరతాబాద్ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రేపటితో టిపిసిసి అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకోబోతున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు(Khairatabad Ganesh Utsav Committee ) గణపతి ప్రతిమను మహేష్ కుమార్ గౌడ్ కి బహూకరించారు.
అంతకు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ భద్రత, విద్యుత్, శానిటేషన్,తాగునీరు తదితర అంశాలపై భక్తులకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి.. వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు లేకుండా మరింత లోతుగా చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న నిమజ్జనం తర్వాత ఏర్పడిన వ్యర్థాల తొలగింపు వేగవంతం చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు.