calender_icon.png 18 May, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్వర్‌రెడ్డీ చిలుక జోష్యం చెప్పుకో..

17-05-2025 01:04:59 AM

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి రాజకీయాలు వదిలేసి.. జ్యోతిష్యం చెప్పుకుంటే బాగుంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో  సీఎం మార్పు ఉంటుందని మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన ఖండించారు.

రెండు నెలలకోసారి మహేశ్వర్ రెడ్డి ఊకదంపుడు  సోది, ఊహకందని స్టోరీలు అల్లుతున్నాడని.. సీఎంపై ఈర్ష, ద్వేషంతోనే ఆయన తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏమి జరుగుతుందో మహేశ్వరెడ్డికి తెలియదని, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీలో ఉంటాడో లేదో తాను జ్యో ష్యం చూసి చెప్పాలని లక్ష్మణ్‌కుమార్ హిత వు పలికారు.

మహేశ్వర్‌రెడ్డికి జ్యోతిష్యంపై అంత పట్టుంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం దాదా పు 12 మంది కత్తులు దూసుకుంటున్నారని, ఒకరి వెనక మరొకరు గోతులు తవ్వుకుం టూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే ఆయనకు గౌర వం ఉంటుందన్నారు.