calender_icon.png 18 May, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నడవడానికి రావడం లేదు!

17-05-2025 01:03:49 AM

- అధ్వానంగా ప్రశాంత్ నగర్‌లోని అంతర్గత రోడ్లు 

- డ్రైనేజీ లైన్ వేసి ప్యాచ్ వర్క్ విస్మరించిన అధికారులు

- వర్షంతో నిలిచిపోయిన నీరు

కార్వాన్, మే 16: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ లైన్ పనులు చేసిన అధికా రులు ప్యాచ్ వర్క్ చేయకపోవడంతో రోడ్లు అద్వానంగా మారాయి. వర్షాలు కురవడం తో కనీసం స్థానికులు నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది.

కార్వాన్ సర్కిల్ పరిధిలోని లంగర్ హౌస్ డివిజన్లోని ప్రశాం త్ నగర్ కాలనీలో కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ పైప్ లైన్ పనులు చేశారు. అనంతరం అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ ప్యాచ్ వర్క్ చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి నీరు నిలిచింది. గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో నీళ్లు నిలిచి శుక్రవారం కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్యాచ్ వర్క్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.