17-05-2025 01:05:49 AM
డాక్టర్ తౌటిరెడ్డి నర్సింగారెడ్డికి ఘన సన్మానం
హనుమకొండ, మే16 (విజయ క్రాంతి):న్యూజెర్సీ తెలం గాణ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ తౌటిరెడ్డి నర్సింగారెడ్డి హన్మకొండ జయ హాస్పిటల్ యండి,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులను అమెరికా న్యూజెర్సీలో పింగల్ భగవాన్ రెడ్డి ఆద్యక్షతన ఘనంగా సన్మానించారు.
మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ నర్సింగారెడ్డిని అమెరికాలో స్తిరపడ్డ ప్రవాస భారతీయ వ్యాపారవేత్తలు, తెలంగాణ తెలుగు వారు అందరు కలసి సన్మానించి గౌరవించడం ఎంతో గౌరవాన్ని సంతోషాన్ని ఇచ్చిందని, వరంగల్ ముద్దు బిడ్డ చిన్న వయస్సులోనే అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఐఎంఏ అద్యక్షలుగా, ప్రైవేట్ నర్సింగ్ హోమ్సు అద్యక్షునిగా జాతీయ మెడికల్ సంఘం ఉపాధ్యక్షుడు గా పనిచేయడం మనకు గర్వకారణమని పింగలి భగువాన్రెడ్డి, తోట రవీందర్, దత్తారెడ్డి, శ్రీనివాసరెడ్డి,మల్లారెడ్డి, గోపి, క్రిష్ణ, లక్ష్మారెడ్డి, డాక్టర్ శ్రీపాల్ బాబా, ద్రువ, డాక్టర్ శ్రీధర్ మొదలగు వారు మాట్లాడుతూ నర్సింగారెడ్డి వైద్య ఆరోగ్య సమాజసేవలను కొనియాడి ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్బముగ సన్మాన గ్రహీత డాక్టర్ టి నర్సింగారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు అందరు కలసి నన్ను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని, సప్తసముద్రాలు దాటి వచ్చి వ్యాపార రీత్యా అమెరికాలో రోజువారి బిజీగా ఉండి వర్కింగ్ రోజు అయిన పెద్ద ఎత్తున హాజరై మన తెలంగాణ బిడ్డపై మీరు చూపించిన ఆదరాభిమానం, నాకు మీరు చేసిన ఘన సన్మానం ముఖ్యంగా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, భగువాన్ రెడ్డి స్నేహితులను నా జీవితం లో మరచి పోలేనిదని మరుపురానిదని, మీరు తెలంగాణ అభివృద్ధిలో కూడ మీ వంతు సహాయసహకారాలు ఉండాలని కోరుచూ అందరికి కృతజ్ఞతలు తెలిపారు.