29 April, 2026 | 3:22 AM

షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం

29-04-2026 01:33 AM

అలంపూర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఈదురు గాలుల బీభత్సానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి  మొక్కజొన్న పంట అగ్నికి కాలి బూడిదయ్యింది. ఈ ఘటన గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

ఉన్నట్టుండి అకస్మాత్తుగా రాత్రి  బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పురవ్వలు మొక్కజొన్న పంటపై పడ్డాయి. బలంగా వీచిన గాలులకు మంట లు ఎగసిపడి ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి చెలరేగాయి. సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయినట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చేతి కందిన పంట కాలిబూడిద కావడంతో రైతులు కన్నీరు మున్నీయ్యారు.