calender_icon.png 15 December, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాల్లో మక్కల పైసలు జమ

13-12-2025 01:04:59 AM

  1. 5 కోట్లు విడుదల చేసిన సర్కారు

‘విజయక్రాంతి’ కథనానికి స్పందన   

మహబూబాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రైతుల ఖాతాల్లో మక్కల పైసలు జమయ్యాయి. శుక్రవారం రూ.౫ కోట్ల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలు సోమవారం చెల్లిస్తామని మహబూబాబాద్ మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్ తెలిపారు. మార్క్‌ఫెడ్‌కు మక్కలు విక్రయించి నెల దాటినా అధికారులు రైతులకు డబ్బులు చెల్లించలేదు.

దీంతో యాసంగి పెట్టుబడులకు రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈనెల 3న విజయక్రాంతి పత్రికలో మక్కల పైసల కోసం నిరీక్షణ పేరు తో కథనం ప్రచురించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 700 మంది రైతుల నుంచి మొక్కజొన్నలు కొన్న మార్కెట్ సుమారు 8 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. రైతుల ఇబ్బందులను విజయక్రాంతి దినపత్రికలో ప్రచురించి ఈ అంశాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకున్నారు.