7 April, 2026 | 2:47 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

07-04-2026 12:58 AM

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  

కృతజ్ఞతలు తెలిపిన రైతులు

నేలకొండపల్లి(కూసుమంచి), ఏప్రిల్ 6(విజయక్రాంతి): నేలకొండపల్లి మండలం ముఠాపురంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జి తుంబూరిదయాకర్ రెడ్డి ప్రారంభించారు. రైతుల కోరిక మేరకు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి  కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న కు మద్దతు ధర లభిస్తుందని దళారులకు అమ్మితే రైతులు నష్టపోతారని ఆయన అన్నారు. ఇప్పుడున్నది రైతు ప్రభుత్వం అని ఇప్పటికే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి క్యాంపు కార్యాలయం ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు, బొడ్డు బొందయ్య, నెల్లూరి భద్రయ్య, దండా పుల్లయ్య, మామిడి వెంకన్న,వేగినాటి లక్ష్మీనరసయ్య, నంబూరు రామారావు, గుడిమళ్ల మధు, బొలినేని వెంకటేశ్వర్లు, సర్పంచ్ లు ఏలూరి రామారావు, కట్టెకొల నాగార్జున, బట్టపోతుల నాగమణి, సీపీఐ నాయకులు భాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు