7 April, 2026 | 2:48 AM

డీసీసీ అధికార ప్రతినిధిగా మహేందర్ రెడ్డి నియామకం

07-04-2026 12:58 AM

మహబూబా బాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా కేసముద్రం పట్టణానికి చెందిన అంబటి మహేందర్ రెడ్డిని నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

2004లో కేసముద్రం మండల కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్గా, 2006లో మండల అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 2020లో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులై పార్టీని గ్రామస్థాయిలో బలపరిచారు. 2023లో జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నూతన కమిటీలో జిల్లా అధికార ప్రతినిధిగా ఆయనకు అవకాశం లభించింది.