11-01-2026 07:00:24 PM
గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ప్రారంభం
ఆరు టీంలతో జనవరి 11 నుండి16 వరకు నిర్వహణ
మర్రిగూడ,(విజయ క్రాంతి): మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలోని, ముత్యాలమ్మ గుడి పక్కన గల క్రికెట్ మైదానంలో, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-3 ను, ఆదివారం గ్రామసర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ మాట్లాడుతూ, ఆరు టీంలతో జనవరి 11 నుండి 16 వరకు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.
టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు, మొదటి బహుమతిగా 25000 రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.15000, తృతీయ బహుమతిగా రూ.10,000 బహుమతులతో పాటు టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, ప్రత్యేకమైనటువంటి బహుమతులను ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమనికి ఆర్గనైజర్లుగా గ్రామ యువత, వార్డ్ మెంబెర్స్, బిఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.