11-01-2026 06:45:03 PM
నిర్మల్,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంతుళ్లు పట్టణాలకు వచ్చిన పిల్లలు గాలిపటాలు ఎగరేసేటప్పుడు విద్యుత్ వైర్ల ను గమనించి జాగ్రత్తగా ఉండాలని పట్టణ ఏడీఈ శ్రీనివాసరావు తెలిపారు. స్లాబు పైనుండి పతంగులు ఎగర వేసేటప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు ఉంటే తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలని పతంగులు వైర్లకు చుట్టుకుంటే గట్టిగా లాగ వద్దని విద్యుత్ వైర్ల వద్ద నుండి పతంగులు ఎగరవేరాదని సపోర్ట్ వైర్లను ముట్టవద్దని సూచించారు ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది అత్యవసర సేవలు అందిస్తున్నామని ఎక్కడైనా ఏదైనా ప్రమాదం ఉన్నట్టు గుర్తిస్తే విద్యుత్ శాఖ ను సంప్రదించాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణంలో విద్యుత్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు