calender_icon.png 12 January, 2026 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్

11-01-2026 07:21:33 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాసనాళాల ఉబ్బసం తీవ్రతరం కావడంతో దాదాపు వారం క్రితం సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమె చికిత్సకు బాగా స్పందించి బాగా కోలుకున్నారని, ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె నివాసంలో తదుపరి చికిత్స కొనసాగించాలని సలహా ఇచ్చారని ఆసుపత్రి సీనియర్ అధికారి వెల్లడించారు.