11-01-2026 06:48:42 PM
మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల: అది తక్కువ సమయంలోనే జనాదరణ పొందిన పత్రికల్లో విజయక్రాంతి ఒకటిగా నిలిచిందని మాజీ మంత్రి బిఆర్ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో విజయక్రాంతి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. పత్రికా రంగంలో విజయక్రాంతి ఒక నూతన ఉరవడి సృష్టించిందన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రిక నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పత్రికా యాజమాన్యానికి పాఠకులకు జర్నలిస్టులకు మాజీ మంత్రి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, కౌన్సిలర్ దేశవాళి సతీష్, సీనియర్ నాయకులు పిట్టల మురళి, జర్నలిస్టు శ్రీనివాసులు, మహేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.