11-01-2026 06:42:07 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అలోక్(ALOK)నేషనల్ ప్రీమియర్ అవార్డుల వేడుకలో సామాజిక విభాగంలో ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన బి.ప్రశాంత్ కుమార్ కు జబర్దస్త్ నటులు షేకింగ్ శేషు చేతుల మీదుగా అవార్డు ను అందచేశారు.
సామాజిక సేవలు చేస్తూ ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో ఒక మంచి సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన వ్యక్తిగా ప్రశాంత్ కుమార్ కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఎవడును అందజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలోక్ నేషనల్ ప్రీమియర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.