11-01-2026 07:05:14 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయినాధుని ఆలయ ప్రధాన ధర్మకర్త బి.జనార్దన్ గౌడ్ను ఆదివారం నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ మేజర్ గ్రామపంచాయతీ నూతన గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్ గౌడ్ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణానికి 11 లక్షల విలువైన స్టీల్ను విరాళంగా అందించినందుకు సన్మానం చేసినట్లు గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు. అందుకు అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున సన్మానం చేయడం జరిగిందన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం అయ్యేంతవరకు తమ సహాయ సహకారాలు ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.జనార్దన్ గౌడ్ను కోరినట్లు సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు.