12-05-2025 03:07:14 AM
హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సెం ట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్నా నీటి కేటాయింపులు జరగలే దని, అనుమతులు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
ఈ ప్రాజెక్టు కింద 70.4 టీఎంసీల నీటిని 6.74 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబూబాద్ జిల్లాలకు ఇవ్వొచ్చని కేంద్రం 2021లోనే నిర్ధారించిందని హరీశ్‌రావు స్ప ష్టం చేశారు. పారిశ్రామిక అవసరాలకూ వాడుకోవచ్చని కేంద్రం తెలిపిందని ఆదివారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఫెల్డ్ తెలం గాణ అంటూ హరీశ్‌రావు పోస్టు చేశారు.
2018 అక్టోబర్ 30న డీటెల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను తమ ప్ర భుత్వం కేంద్ర జల సంఘానికి అందజేసిందని, 2021 సె ప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అం దుబాటులో ఉన్నాయ ని సీ డబ్యూసీ హై డ్రాలజీ నిర్ధారించిందన్నా రు. కృష్ణానదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందంటూ ఫైర్ అయ్యారు.
ఆంధ్రా పాలకులు గోదావరిలో నీటి దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ అడ్డుకోవడం లేదన్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్‌వర్క్ ఆంధ్రాలో పెట్టి శాశ్వతంగా తాళం వేశారని, రాజీవ్‌సాగర్ పైప్‌లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుం డా వేసి అనుమతులు రాకుండా చేసింది మీరేనని హరీశ్ రావు ఆరోపించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వలన సాగర్ ఆయకట్టుకు కరవు వచ్చిందని, అందుకే తాము గోదావరి మీద సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూ పొందించామన్నారు. ప్రా జెక్టులు తాము నిర్మిస్తే అక్కడికి పోయి ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము టీఏసీ తప్ప అన్ని అనుమతులు పూర్తిచేశామని, అధికారులతో మాట్లా డి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.