calender_icon.png 14 May, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్‌సెట్ ఫలితాలు సీఎం నివాసంలోనా?

12-05-2025 02:47:25 AM

  1. విద్యార్థులపై సీఎం చులకన భావన 
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలను జూబ్లీహిల్స్‌లోని తన ప్యాలెస్‌లో విడుదల చేయడం సీఎం రేవంత్‌రెడ్డి అహంభావంతోపాటు పాలన మీద, విద్యార్థుల మీద ఉన్న చులకన భావాన్ని తెలియజేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోటీ పరీక్షల ఫలితాలను ఇంటి నుంచి విడుదల చేయలేదన్నారు. ఈ మేరకు హ్యాష్‌ట్యాగ్ కాంగ్రెస్ ఫెల్డ్ తెలంగాణ అంటూ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.