calender_icon.png 20 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా!

29-10-2024 01:23:20 AM

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మంథనిని సంపూర్ణ ఆరోగ్య నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంథని పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో సోమవారం ఎన్‌టీపీసీ, రోహిణి ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తాధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన డెంటల్ స్కీనింగ్ మెడికల్ క్యాంప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఇల్లు గుల్ల చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతా మన్నారు. చదువుకుంటేనే జ్ఞానం వస్తుందని, ఆ జ్ఞానంతో పిల్లలు మున్ముందు పది మందికి మేలు చేయవచ్చన్నారు. మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయం వద్ద రెండు కోట్లతో ఘాట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రామగిరి ప్రాంతంలోని రామగిరి  రూ.5 కోట్లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.

అనంతరం మంత్రి పెద్దపల్లి ప్రభుత్వ ద వాఖానకు చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న ముత్తారం కాస్తూర్బా విద్యాలయ విద్యార్థులను పరామర్శించారు. వారి తో స్వయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పిల్లలకు మె రుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందోళ న చెందవద్దని భరోసానిచ్చారు.

తర్వాత మంత్రి ఎక్లాస్‌పూర్‌లో పీఏసీఎస్, ఏఎంసీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రామగిరిలో ఎకో పార్క్ పనులకు శంఖుస్థాపన చేశారు. పర్యటనలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు కార్యర్తలు పాల్గొన్నారు.