29-10-2024 01:24:14 AM
మంచిర్యాల, అక్టోబర్ 28 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గుడిరేవు గోదావరి తీరంలోని పద్మల్‌పురి కాకో ఆలయం సోమవారం గిరిజనులతో కిటకిటలాడింది. ఈ దర్బార్‌కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిజనులే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి భారీగా ఆదివాసీలు తరలివచ్చారు.
ఆదివాసీ కళాకారులు డప్పుచప్పుళ్లు, సంప్రదాయ గుస్సాడీ నృత్యాలతో సందడి చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మంచిర్యాల డీసీపీ ఎగ్గరి భాస్కర్, రాష్ట్ర జీసీసీ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
లక్షెట్టిపేట సీఐ నరేందర్, దండేపల్లి ఎస్సై ఉదయ్ కిరణ్, పోలీస్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కుడిమేత సోము, మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, రాయి సెంటర్ జిల్లా సభ్యుడు పెందూరు రాం పటేల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.