29-10-2024 01:22:22 AM
మంథని, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): అనారోగ్య సమస్యలతో భర్త సతమతమవుతున్నాడు. తానింక ఎవరికీ భారం కావొద్దని అనుకున్నాడో ఏమో ఇంటి దులానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది చూసి భార్య కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో చోటుచేసుకున్నది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన బొడిగే సుజాత (53), శంకర్ (60) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరి వివాహాలు చేసి అత్తవారింటికి పంపారు. తర్వాత భార్యాభర్తలు నాగారంలో ఉంటున్నారు. కొంతకాలం నుంచి సుజాత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది.
సోమవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చిన శంకర్ విగత జీవిగా భార్యను కుప్ప కూలాడు. భార్య లేని జీవితం తనకెందుకు అనుకున్నాడో ఏమో తాను అదే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.