calender_icon.png 3 September, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయండి

31-08-2025 06:00:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సి.పి.యస్.ఉద్యోగుల సంఘం తో పాటుగా,తెలంగాణ ఉద్యోగుల జెఏసి, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం రాజధాని లో  వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిని విజయవంతం చేయాల్సిన భాధ్యత ఉద్యోగ,ఉపాధ్యాయులపై ఉన్నదని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు పేర్కొన్నారు. అదే విధంగా జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టి ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, తదనుగుణంగా వెంటనే ముఖ్యమంత్రి సీపీఎస్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధానం తో రెండు లక్షలపై చిలుకు మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తే ఏటా రూ.3000 కోట్లు ఆదా అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ పెన్షన్ జిఓకు సవరణ చేసి బేషరతుగా ఇవాలని కోరారు. భారీ సంఖ్యలో హాజరయ్యి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యతను చాటాలన్నారు.