03-09-2025 09:32:42 AM
గణపతి బొప్పా మోరియా.. యూరియా రావాలయ్యా అంటూ రైతుల నినాదాలు
కోయిల్ కొండ : యూరియా కోసం కోయిలకొండ మండలం గార్లపాడు గ్రామ పరిధిలో సహకార సంఘం కార్యాలయం దగ్గర క్యూలైన్లో చెప్పులు ఉంచి ఆ చెప్పులకు కాపాలదారులుగా రైతులు ఉంటూ గణపతి బొప్పా మోరియా.. యూరియా రావాలయ్యా... రావాలయ్యా అంటూ బుధవారం తెల్లవారుజామున నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు మహబూబ్ నగర్ కు 550 మెట్రిక్ టన్నులు,నాగర్ కర్నూల్ కు 650 మెట్రిక్ టన్నులు,నారాయణ పేటకు 300 మెట్రిక్ టన్నుల యూరియా జడ్చర్ల రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్ కు మంగళవారం చేరింది. జిల్లా వ్యాప్తంగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోయిలకొండ సహకార సంఘం కార్యాలయం దగ్గరికి వెంటనే యూరియా చేర్చాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. వచ్చిన యూరియా తో జిల్లావ్యాప్తంగా కొరతా తీరనున్నట్లు సంబంధిత అధికార యంత్రాంగం చెబుతుంది. గంటల వ్యవధిలోని సహకార సంఘం కార్యాలయానికి యూరియా చేరే అవకాశం ఉంది.