03-09-2025 09:25:49 AM
పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గ(Patancheru constituency) పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం పంచామృత అభిషేకము మరియు విశేష శ్రీ అన్నపూర్ణేశ్వరుడిగా ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి ప్రతిరోజు మహా చండి హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు విశేష అభిషేకాలు అలంకరణతో పల్లకి సేవ వివిధ సాంస్కృతి సాంప్రదాయ భక్తిశ్రద్ధలతో భజన సంకీర్తనలతో మహిళల కోలాటాలతో భక్తులను అలరింప చేశాయి అనంతరం ఈవో లావణ్య మాట్లాడుతూ... భక్తులకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న సిద్ధి గణపతి భక్తులకు నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నదాన కార్యక్రమాలు మంచినీటి సౌకర్యం అందరి సామాన్య భక్తులకు సిద్ది గణపతి దర్శనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి లావణ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది,భక్తులు గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.