calender_icon.png 3 September, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ గారు మా సమస్యను పరిష్కరించరా?..

03-09-2025 10:36:29 AM

నిరుపయోగంగా మారిన వాటర్ ప్లాంట్

చండూరు,(విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో గతంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారి ఎంపీ నిధులనుండి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని సంవత్సరాల నుండి ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన గాని పట్టించుకోవడంలేదని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు ఖర్చు చేసిఈ వాటర్ ప్లాంట్ ను ప్రజలకు ఉపయోగపడాలని ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు కానీఇంతవరకు ప్రారంభించలేదు. అసలు ఈ వాటర్ ప్లాంట్ ను ఎందుకు ప్రారంభించడం లేదో అర్థం కాని పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుండి ఈ ప్లాంటు నిరుపయోగంగా ఉంది కానీ ఎనాడు ఈ ప్లాంట్ నుండి ప్రజలు నీటిని తెచ్చుకోలేదు.

గతంలో చాలాసార్లు అధికారులకు చెప్పినా కూడా ప్లాంటును ప్రారంభించకపోవడం శోచనీయం. ఎలాగో గ్రామాల్లో సాగర్ నీరు వస్తుందని సాకుతో ప్రారంభించడం లేదా అన్న సందేహం ప్రజలలో నెలకొన్నది. సాగర నీరు వచ్చినప్పటికీ ఈ గ్రామంలో ఫంక్షన్లు, శుభకార్యాలు, ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ చాలాఅవసరం. కానీ గ్రామంలో శుభకార్యాలు జరిగినప్పుడు డబ్బులు పెట్టి నీటిని తెచ్చుకుంటున్నారు. పదిమందికి ఉపయోగపడాలన్న ఈ ప్లాంటు ఎవరికి కూడా ఉపయోగపడటం లేదు.ఇట్టి విషయంపై ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.