calender_icon.png 4 September, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తా

03-09-2025 01:21:08 AM

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చివరి కోరిక అదే..

  1. వైఎస్సార్ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు 
  2. రైతుబాంధవుడిగా నిలిచిపోతారు
  3. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆయన కల 
  4. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం
  5. వైఎస్సార్ స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  6. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాశ్ పాలేకర్‌కు అవార్డు ప్రదానం

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ‘ఎలాగైనా నేను ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తా. రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్సార్) కోరిక. వైఎస్సార్ ఆశ యాన్ని నేను సాధిస్తా’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ దస్‌పల్లాలో మంగళవారం ప్రకృ తి వ్యవసాయ నిపుణుడు సుభాశ్ పాలేకర్‌కు వైఎస్సార్ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేసి మాట్లాడారు.

వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ముందుకు సాగు తోందని, ఆయన కలలుగన్న ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. పంటలకు ఉచిత విద్యుత్ అనగానే దేశంలో ఎవరికైనా వైఎస్సార్ పేరే స్ఫురణకు వస్తుందని కొనియాడారు. ఉచిత విద్యుత్ ఇచ్చి వైఎస్సార్ రైతుబాంధవుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని శ్లాఘించారు.

రైతులకు సంబంధించిన విద్యుత్ బకాయిలను రద్దు చేయడమే కాదు, వారిపై పెట్టిన కేసులను సైతం ఎత్తివేసిన మానవతావాది వైఎస్సార్ అని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ రద్దు చేయలేని విధంగా వైఎస్సార్ అమలు చేశారని వివరించారు. ‘అధికారం మాయమైనప్పుడు మిత్రులు మాయమైపోతూ ఉంటారు. కానీ, కేవీపీ రామ చంద్రరావు చదువుకునే రోజుల నుంచి వైఎస్ మరణం వరకు తోడుగా ఉన్నారు.

వైఎస్సార్ ఆలోచనలు కేవీపీ కొనసాగిస్తున్నారు. కేవీపీలా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలి. కొందరు నా దగ్గరకు కేవీపీలా ఉంటామని వస్తారు. ఎవరినైనా మొదటివారం లోపలికి రానిస్తే రెం డో వారం నా కుర్చీలో కూర్చుంటానంటున్నారు. ఇది అనుభవంతో చెప్తున్నా’ అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని గుర్తుచేశారు.

కేవలం మూ డు నెలల్లోనే రుణమాఫీ అమలు చేశామని వెల్లడించారు. కేంద్రం యూరియా విషయంలో సహకరించకపోయినా, సు భాష్ పాలేకర్ చూపిన ప్రకృతి వ్యవసాయ మార్గంలో రైతులను ప్రోత్సహిం చి వారిని ఆదుకుంటామని భరోసా ఇ చ్చారు. గోదావరి జలాలను ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు తరలించాలన్నది వైఎస్సార్ సంకల్పమని, ఆ దిశగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తమ ప్రభుత్వమే నిర్మిస్తుందని ప్రకటించారు.

నల్లగొండ జిల్లాను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు వైఎస్సార్ రూ.2 వేల కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశా రు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి 3.60 లక్షల ఎకరాలకు నీరందించి, నల్లగొండ ప్రజల రు ణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు.  సీఎం అనంతరం కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్ర ఎకాలజీ వ్యవస్థాపకులు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, సుధా దంపతులకు పురస్కారం అందజేశారు.

ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అధ్యక్షురా లు వైఎస్ షర్మిల హాజరై, తన తండ్రి వైఎస్సార్ గురించి అనేక మంది నాయకుల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్ గౌడ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ హుడా, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి  పాల్గొన్నారు. 

వైఎస్సార్ స్ఫూర్తితోనే ప్రజా పాలన: డిప్యూటీ సీఎం భట్టి

దివంతగ ముఖ్యమంత్రి వైస్సార్ స్ఫూర్తితోనే తాము ప్రజాపాలన అందిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్ర మార్క తెలిపారు. తమ ప్రభుత్వానికి వైఎస్సార్ ఆలోచనా విధానమే స్ఫూర్తి అని కొనియాడారు. వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని తమ ప్రభుత్వం మరింత ఉన్నతంగా కొనసాగిస్తున్నదని స్పష్టం చేశారు.

పంటలకు ఉచిత విద్యుత్ వైఎస్సార్ పేటెంట్ అని అభివర్ణించారు. వైఎస్సార్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ వైద్యపరిమితిని తాము రూ.10 లక్షలు పెంచామని స్పష్టం చేశా రు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతు భరో సా ఇచ్చాం’ అన్నారు.

రైతు పక్షపాతి : మంత్రి శ్రీధర్‌బాబు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్సార్) కేవ లం పాలకుడు మాత్రమే కాదని, రైతు ల గురించి, గ్రామాభివృద్ధి గురించి నిరంతరం తపించారని  మంత్రి దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. వైఎస్సార్‌తో తనకెంతో అనుబంధం ఉం దని గుర్తుచేసుకున్నారు. నిజమైన పాలనాదక్షుడు వైఎస్సార్ అని శ్లాఘించారు. వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు.

వైఎస్సార్ ఎల్లప్పుడూ వ్యవసాయ రంగంతోపాటు గ్రామీణ ప్రాంతాల సమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూ చించేవారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్సార్ తొలి సంతకం పంటలకు ఉచిత విద్యుత్ దస్త్రంపై సంతకం చేసిన రోజు ఇప్పటికీ తనకు గుర్తుందని పేర్కొన్నారు.

నాటి సీనియర్ అధికారులు 7 గంటల పాటు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తామని, సందేహా లు వెలిబుచ్చినా వైఎస్సార్ వారి తో ఓపిగ్గా చర్చించి, మార్గనిర్దేశం చేశారని తెలిపారు. వైఎస్సార్ చూ పిన బాటలోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని, రైతుల సం క్షేమానికి పెద్దపీట వేస్తున్నదని వెల్లడించారు.