03-09-2025 01:21:19 AM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ లో ‘మన పార్వతీ పుత్ర గణేషుడి’కి భక్తులు తీరొక్క ప్రసాదాలు సమర్పించారు. గుండేటి అనసూర్య అనే భక్తురాలు ఒక్కరే ఏకంగా 55 రకాల ప్రసాదాలను సమర్పించి దేవుడి మీద తనకు ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు, మహిళలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్త మండలి అధ్యక్షుడు సిరిపురం గణపతి, కోశాధికారి బోడకుంట నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి హరి, గౌరవాధ్యక్షుడు చిటూరి పాపారావు, ప్రచార కార్యదర్శి మారం రఘు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.