calender_icon.png 3 September, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయ‌తీ వ‌ర్క‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

03-09-2025 10:38:48 AM

ఎంపీడీఓ  కార్యాల‌యం ఎదుట కార్మికుల  ధ‌ర్నా 

మునిప‌ల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయ‌తీ వ‌ర్క‌ర్ల  స‌మ‌స్య‌లు  ప‌రిష్క‌రించాల‌ని  ఆ యూనియ‌న్ మండ‌ల  అధ్య‌క్షుడు ఇమ్మానియేల్(Union Council President Emmanuel)  అన్నారు.  వ‌ర్క‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని  డిమాండ్ చేస్తూ .. మంగ‌ళ‌వారం నాడు  మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎంపీడీఓ కార్యాల‌యం ఎదుట  ధ‌ర్నా నిర్వ‌హించారు. అనంత‌రం ఎంపీడీఓ కార్యాల‌య సూప‌రిండెంట్ రామ‌లింగంకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా  గ్రామ పంచాయ‌తీ కార్మికుల యూనియ‌న్ అధ్య‌క్షుడు  ఇమ్మానియేల్  మాట్లాడుతూ  వర్కర్ల పెండింగ్ జీతాలు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పాత కేటగిరాలన్నింటినీ కొనసాగించాలన్నారు. అలాగే పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత రిటర్మెంట్ బెనిఫిషర్ట్స్ కలిగించడంతో పాటు   ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాల‌న్నారు. అదే విధంగా   కార్మికుల‌కు  సబ్బులు, షూలు,  నూనె బెల్లం డ్రెస్సులు,  ఐడి కార్డులు తప్పక చెల్లించాల‌ని,  కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాలకు రూ. 20 వేల  చెల్లించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.  ఈ య‌కార్య‌క్ర‌మంలో   కార్మికులు రవి , విఠ‌ల్‌ గౌడ్,  శంకరయ్య,  ప్రభాకర్,  దశరథ్,  లక్ష్మి,  అనిత తదితరులు పాల్గొన్నారు.