calender_icon.png 3 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి వివేక్

03-09-2025 09:30:41 AM

రామకృష్ణాపూర్,విజయక్రాంతి: క్యాతనపల్లి పురపాలకం రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్(Singareni RKCOA Club) వద్ద మంగళవారం కార్మిక,గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్ల అర్హులైన 230 మంది లబ్ధిదారులకు (ప్రాసీడింగ్)పట్టాలను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పేదలకు మేలు జరిగిందని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత కరెంట్,కొత్త రేషన్ కార్డులు,సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలతో పేదలు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్య,తహశీల్దార్ సతీష్,పుర కమిషనర్ రాజు,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు తదితరులు పాల్గొన్నారు.