04-07-2025 12:25:32 AM
ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ
నల్లగొండ టౌన్, జూలై 3 : ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యార్థి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో టెక్నో ఈ టెక్నో స్పార్క్ బ్యాచ్ అని పేద బడుగు బలహీన వర్గాల కి చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద బిడ్డల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేయడం చాలా దుర్మార్గం అన్నారు. జిల్లా యంత్రాంగం నిమ్మక్క నీరెత్తినట్టు వ్యవహరించడం దౌర్భాగ్యకరమని బడుగు బలహీన వర్గాలకి చెందినవారికి విద్య వైద్యం ఉచితంగా అందించాలని అన్నారు.
ప్రవేట్ పాఠశాలలో నర్సరీకి 30వేల రూపాయల డొనేషన్ తీసుకుంటూ ఏడవ తరగతి లోపు విద్యార్థులకు 70000 వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకే బ్యానర్ తో పర్మిషన్ తీసుకొని మూడు నాలుగు పాఠశాలలు నడుపుతూ బుక్స్ నోట్స్ యూనిఫాం విక్రయిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
సమావేశంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు బుకారెడ్డి, సింగారం అజయ్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్, జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా కోఆర్డినేటర్ వినోద్ చారి, యూత్ పట్టణ అధ్యక్షులు షర్టు యశ్వంత్, కోఆర్డినేటర్ షర్టు చరణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మారేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.