2 July, 2026 | 4:12 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ఉపాధి కూలీల కలెక్టరేట్ ధర్నా విజయవంతం చేయండి

23-05-2025 01:53 AM

బలరాం సీఐటీయూ జిల్లా కార్యదర్శి

నారాయణపేట. మే 22 (విజయక్రాంతి): జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీల రెండు  నెలలు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రోజు కూలి 600 రూపాయలు పెంచి సంవత్సరంలో 200  పని దినాలు కల్పించాలని కోరుతూ ఈనెల 26న నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఉంటుందని సిఐటియు జిల్లా కార్యదర్శి బల్ రామ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన బుధవారం రోజు  నారాయణపేట  మండల పరిధిలోని సింగారం ,శేర్నపల్లి గ్రామాల శివార్లలో  పనిచేస్తున్న ఉపాధి పని ప్రదేశాలను సందర్శించి ఉపాధి కూలీలతో మాట్లాడారు.  పలు సమస్యలు కూలీలు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు.  ఉపాధి కూలీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అదేవిధంగా ఉపాధి బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు కేంద్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా కేవలం 86,000 కోట్ల రూపాయలే కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు .

ఉపాధి కూలీలకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వేసవికాలంలో 50 శాతం అదనపు కూలి కలిపి ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరుగుతున్న కలెక్టరేట్ ధర్నాను ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు నరహరి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ కూలీలు పాల్గొన్నారు.