23-05-2025 01:55:39 AM
జిల్లా ఎస్పీ జానకి
మహబూబ్ నగర్ మే 22 (విజయ క్రాంతి) : జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ప్రముఖ సమాజ సేవకులు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ అధికారి డి. జానకి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకులు.
ఆయన అసలుపేరు మ్యాదరి భాగయ్య అని, నిరంతర పోరాటాల ఫలితంగా ‘వర్మ’ అనే బిరుదు దక్కింది. సమాజంలో సమానత్వం కోసం, ప్రత్యేకంగా దళితుల మరియు వెనుకబడిన తరగతుల కోసం విస్తృతంగా ఉద్యమాలు చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాములు, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు.