calender_icon.png 11 May, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

10-05-2025 01:06:37 AM

కరీంనగర్ క్రైం, మే 9 (విజయ క్రాంతి): నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఈ నెల 20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని, జిల్లాలోని సంఘటిత, అసంఘటిత కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్  పిలుపునిచ్చారు. 

శుక్రవారం నగరంలోని బైపాస్ రోడ్ లో గల సిమెంట్ గోదాం వద్ద సార్వత్రిక సమ్మె పోస్టర్ ను హమాలీ కార్మికులతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  సిమెంట్ గోదాంహమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి, ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు నన్నవేని శ్రీనివాస్, ననవేని కొమరయ్య, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.