నల్లగొండలో జరిగే పి.డి.ఎస్.యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి
సూర్యాపేట రూరల్, ఆగస్టు 26: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న పి.డి.ఎస్.యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల గోడపత్రికలను సూర్యాపేటలోని 60 ఫీట్ రోడ్డులో జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులను సీనియర్ అడ్వకేట్ జి.వెంకటేశ్వర్లు ప్రారం భిస్తారని, బి.ప్రదీప్, సాదినేని వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి, ఎం.శ్రీనివాస్, జీడి సారయ్య తదితర మేధావులు వివిధ అంశాలపై విద్యార్థులకు క్లాసులు బోధిస్తారని తెలిపారు.
విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించడం, అశ్లీల సాహిత్యం, గంజాయి వంటి చెడు అలవాట్లను అరికట్టడం మరియు విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సమాయత్తం చేయడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంతో విద్య ను కార్పొరేటీకరణ చేస్తోందని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయడంలో,ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయ డంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ శిక్షణ తరగతుల ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్. యు నాయకులు ప్రవీ ణ్, వినయ్, రాజు, మనీ, శివ, సాయి, మహేష్, నవీన్, తరుణ్, రాము తదితరులు పాల్గొన్నారు.






