27 August, 2026 | 2:04 AM

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

27-08-2026 12:00 AM

దామరచర్ల,ఆగస్టు 26: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను , కాంగ్రెస్ నాయకుల తో కలిసి బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు.నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు.

ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగు నాయక్ , స్కైలాబ్ నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారతదితరులు ఉన్నారు.