calender_icon.png 21 December, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎల్‌పీఏ రాష్ట్ర ఐదవ సదస్సు

21-12-2025 12:00:00 AM

కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): కొత్తగూడెం క్లబ్‌లో ఇండియన్ లీగ ల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) ఆధ్వర్యంలో ఐదవ తెలంగాణ రాష్ర్ట సదస్సు నిర్వహించారు. ఐఎల్‌పీఏ నేషనల్ ప్రెసిడెం ట్ సుజాత కె.చౌదంతే, జిల్లా జడ్జి పాటిల్ వ సంత్, రాష్ర్ట అధ్యక్ష, కార్యదర్శులు, లాయర్లు పాల్గొన్నారు. రాష్ర్ట సెక్రటరీ శ్యాంసన్ మా ట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు దాడులను ఎదుర్కొనేందుకు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్‌ను ప్రొటెక్ట్ చేసేందుకు, బలహీన వర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులకు న్యాయస్థానాల్లో  లీగల్‌గా ధీటుగా  వాదనలను వినిపించేందు కు వారికి సబ్జెక్టు వైజ్‌గా శిక్షణ, వృత్తిలో రా ణించేందుకు ఉచితంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఆన్‌లైన్ కోచింగ్‌లు ఇస్తున్నామని, ఈ సంస్థలో కోచింగ్ పొందినవారు 65 మంది ఏపీపీలుగా సుమారు 15 మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎం పికయ్యారని తెలిపారు. నిధులు లేక సరైన ప్రోత్సాహం లేని అడ్వకేట్స్‌ను ఐఎల్‌పిఏ ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు కోర్టులో ఎటువంటి భయం లేకుండా  సరైన వాదనలు వినిపించేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో శిక్షణ ఇస్తుందన్నారు.

ఐఎల్‌పీఏ రాష్ర్ట అధ్యక్షుడు పొన్నం దేవరాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుం దని సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో సైతం ఐఎల్పిఏ పాల్గొన్నట్లు తెలిపారు. రాజ్యాంగ ప్రకారం రావాల్సిన హక్కులు దక్కేలా చూడ టం దేశంలో 1931లో కుల గణన బ్రిటిష్ కాలంలో జరిగిందని ఆనాటి నుంచి నేటి వరకు ఏ ఒక పాలకులు ప్రభుత్వం కులగనన చేయలేదని విమర్శించారు. ఆర్టికల్ 340 ప్రకారం దేశంలో కుల జన గణన జరగాలని డిమాండ్ చేశారు.