calender_icon.png 26 August, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ

26-08-2025 06:49:33 PM

చిట్యాల(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులతో వినాయకుని మట్టి విగ్రహాలను తయారు చేయించి పర్యావరణంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చిట్యాల విద్యశాఖ అధికారి కోడెపాక రఘుపతి బహుమతులను ప్రధానం చేశారు.కృత్రిమ రంగులు పర్యావరణానికి హానిచేస్తాయని పర్యావరణహితంగా పండుగలు జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి,సరళ దేవి,శ్రీనివాస్,విజయలక్ష్మి,నీలిమారెడ్డి,సుజాత,సదయ్య,శంకర్, సూధం సాంబమూర్తి, ఉస్మాన్ అలీ,మౌనిక, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.